తెలంగాణపై తుఫాన్ ప్రభావం !

Telugu Lo Computer
0


తెలంగాణపై మి చౌంగ్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో డిసెంబర్ 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపుల, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాష్ట్రానికి యెల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం, జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ లో హనుమకొండ జనగాం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)