వాకింగ్‌ వెళ్తే వజ్రం దొరికింది !

Telugu Lo Computer
0


మెరికాకు చెందిన జెర్రీ ఎవాన్స్ అర్కాన్సాస్‌లో నివసిస్తున్నాడు. ఒకరోజు జెర్రీ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వాకింగ్‌ కోసం వెళ్లాడు. వాకింగ్‌ లో అతడి కాలికి ఏదో గాజు సీసం ముక్కలాంటిది తగిలింది. అది చూసి సీసం పెంకు అనుకున్నాడు.. ఇక్కడే వదిలేస్తే మరెవరికైనా గుజ్జుకుంటుందని భావించాడు. దాంతో ఆ గాజుముక్కను తన జేబులోనే ఉంచుకున్నాడు. అయితే ఆ తర్వాత దాన్ని పరిశీలించగా అది 4.87 క్యారెట్ల వజ్రమని తేలింది. మూడేళ్లలో పార్కులో ఇప్పటివరకు దొరికిన అతి పెద్ద వజ్రం ఇదేనని తెలిసింది. పార్క్ ఓపెన్ పాలసీని కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే వ్యక్తులు తమకు దొరికిన వజ్రాలను తమ వద్ద ఉంచుకోవడానికి అనుమతిస్తారు. 1972లో స్టేట్ పార్క్ స్థాపించబడినప్పటి నుండి, ఇక్కడ 75,000 కంటే ఎక్కువ వజ్రాలు లభించాయి. ఇన్వాస్‌కు దొరికింది గాజు ముక్క కాదని, వజ్రమని తెలుసుకున్నాడు. అప్పుడు కూడా అతను నమ్మలేదు. జెమోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా నుంచి కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్స్టిట్యూట్ దీనిని నిజమైన వజ్రం అని తేల్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)