సీనియర్ నటి లీలావతి మృతి

Telugu Lo Computer
0


ప్రముఖ కన్నడ నటి లీలావతి (85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)