ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మహాలక్ష్మీ ఫ్రీ బస్ స్కీమ్ ను ప్రారంభించారు. ఆయనతో పాటుగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ లు ఈ బస్సు ప్రయాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులు ఉత్తమ్, భట్టి, పొన్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సీఎస్ శాంతికుమారి, నిఖత్ జరీన్ లకు తొలి టికెట్ అందజేశారు. అలాగే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ పథకాలను ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)