మహారాష్ట్రలో ఉల్లి రైతుల నిరసన

Telugu Lo Computer
0


ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ముంబై-ఆగ్రా హైవేపై మూడు చోట్ల శుక్రవారం రాస్తారోకోలు నిర్వహించారు. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి వేలం పాటలను నిలిపివేశారు. అసల్‌గావ్, చాంద్వాడ్, నంద్‌గావ్, దిండోరి, ఏవ్లా, ఉమరానేతోపాటు నాసిక్ జిల్లాలోని ఇతర ప్రదేశాలలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి వేలంపాటలను రైతులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అసల్‌గావ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపిఎంసి)లో ఉల్లి ఆక్షన్లు జరగలేదని, కాని వించూర్, నిఫడ్ సబ్ కమిటీలలో మాత్రం జరిగాయని ఒక అధికారి చెప్పారు. వించూర్ మార్కెట్‌కు శుక్రవారం ఉల్లి లోడుతో 600 వాహనాలు వచ్చాయని, క్వింటాలుకు కనిష్ఠ ధర రూ. 1,500 ఉండగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 3,300 ఉందని అధికారి చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)