సముద్ర భద్రతపై ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో మోడీ చర్చలు !

Telugu Lo Computer
0


ముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత్‌ మరియు సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్తుపై హెచ్‌ఆర్‌హెచ్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ప్రధాని చర్చలు జరిపినట్లు పిఎంఓ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకున్నారని, ఉగ్రవాదం, హింస మరియు ప్రాణ నష్టానికి సంబంధించిన ఆందోళనలపై చర్చించినట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రత కోసం భారత్‌తో కలిసి పనిచేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించింది. సముద్ర భద్రత, నావిగేషన్‌ స్వేచ్ఛను కొనసాగించాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు ఉద్ఘాటించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఏడెన్‌ గల్ఫ్‌ మరియు అరేబియా సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)