భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు రక్షకులుగా తేనెటీగలు ?

Telugu Lo Computer
0


భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద అక్రమ చోరబాట్లు లేకుండా తేనె టీగలు రక్షణగా ఉండబోతున్నాయి. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద సరిహద్దుల్లో తేనె టీగలను కాపలాగా ఉంచబోతుంది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం పెద్ద ఎత్తున తేనె టీగల పెంపకాన్ని బీఎస్ఎప్ చేపట్టనుంది. అయితే ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చేపట్టారు. ఎందుకంటే ఈ సరిహద్దుల్లోనే అక్రమ చోరబాట్లు ఎక్కువ. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తరచూ అక్రమంగా చొరబడుతుంటారు. ఈ క్రమంలో చాలా మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఫెయిల్ అయ్యి అక్రమంగా దేశంలోకి చోరబడుతున్నారు. అందుకే ఇకపై భారత్-బంగ్లా సరిహద్దుల్లో చోరబాటుదారులను తిప్పికొట్టే బాధ్యతను తేనెటీగలు చూసుకునేలా బీఎస్ఎఫ్ ప్లాన్ చేసింది. ఈ మేరకు సరిహద్దులో భారీ ఎత్తున తేనె టీగల పెంపకాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చొరవతో బీఎస్ఎఫ్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. బార్డర్ వద్ద ఉన్న కంచెలకు బాక్సులు ఏర్పాటు చేసి అందులో తేనె టీగల పెంపకాన్ని ప్రారంభించారు. ఎవరైనా ఈ ముళ్ల తీగను దాటడానికి ప్రయత్నిస్తే వారిని తేనె టీగలు తిప్పికొడతాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బీఎస్ఎఫ్ భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4.96 కి.మీ పొడవైన సరిహద్దు వద్ద ముళ్ల తీగలు ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ముళ్ల తీగలపై తేనెటీగలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఛప్రా, బాన్‌పూర్‌, కడిపూర్‌, అంచాస్‌ సరిహద్దుల్లో 200 బాక్సుల తేనెటీగల పెంపకాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం సరిహద్దులోని ముళ్ల కంచెలో తేనెటీగలు ఇష్టపడే కొన్ని పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇక్కడే తేనెటీగల పెంపకం పెట్టె ఇక్కడ ఉంచుతున్నారు. తేనెటీగలకు ఇక్కడ వాతావరణం చాలా సహజంగా కనిపించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. వైబ్రంట్ విలేజ్‌లో తరహాలో ఈ తేనెటీగల పెంపకం పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద, భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. తద్వారా తేనె టీగలు చొరబాటు ప్రయత్నాలను తగ్గిస్తాయో లేదో చూడాల్సి ఉంటుందని బీఎస్ఎఫ్ పేర్కొంది. కృష్ణగంజ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ 20 తేనే తీగల బాక్సులను ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ఇక్కడ ఈ పెట్టెల నిర్వహణ బాధ్యతను స్థానిక ప్రజలు తీసుకుంటారు. తేనెను సేకరించే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. కాబ్టటి ఈ ప్రాజెక్ట్ వల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. తేనేతీగలను పెంచే బాక్సులను బార్డర్‌లో ఉంచుతారు. సరిహద్దులో చోరబాటుదారులు వచ్చే క్రమంలో ముళ్ల కంచే తీగలు కదలుతాయి కాబట్టి, అప్పుడు తేనెటీగల బాక్సులు కూడా కదులుతాయి. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా లేచి చోరబాటుదారులపై దాడి చేస్తాయని బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ బెంగాల్ బోర్డర్ డీఐజీ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తేనెటీగలు.. ముళ్ల తీగ దగ్గరకు వచ్చేవారికి పెద్ద ప్రమాదమన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద తేనెటీగల పెంపకం జరుగుతుందని, ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న రోజుల్లో ఇతర సరిహద్దుల్లోనూ ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపడతామాని ఆయన పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)