ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడు !

Telugu Lo Computer
0


కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం జమ్మూలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  'దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానం. ప్రతి భారతీయుడి భావన ఇదే. మీకు చెడుచేయాలని చూస్తే సహించేది లేదు. అలాంటి దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. మీరంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలుసు. మీ ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివి. ఒక సైనికుడు అమరుడైతే, మేమిచ్చే పరిహారంతో ఆ నష్టాన్ని పూడ్చలేదు. ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది. మీ భద్రత, సంక్షేమం మాకు అధిక ప్రాధాన్యం.' అని మంత్రి అన్నారు. కాగా, ఇటీవలి ఆపరేషన్లలో లోపాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి అధికారి విచారణను ఎదుర్కొంటున్నారు. మరోపక్క పూంఛ్‌ జిల్లాలో కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మృతి చెందిన ఘటనలో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరోపక్క సైనిక వాహనాలపై దాడి వంటి ఘటనల నేపథ్యంలో కేంద్రమంత్రి పర్యటన జరుగుతోంది. జమ్మూలోని రాజ్‌భవన్‌లో ఉన్నతస్థాయి భద్రతా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)