రేపు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం !

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ ను ప్రయోగించనున్నారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌ పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్‌ పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)