భారీ భూకంపంలో 111 మంది దుర్మరణం

Telugu Lo Computer
0

చైనాలో భారీ భూకంపం సంభవించి 111 మందిజ్ ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. చైనా వాయవ్య ప్రాంతంలోని గాన్సు ప్రావిన్స్‌లో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా రికార్డయింది. భూమి ప్రకంపించగానే జనం ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. దీని తీవ్రత పొరుగునే ఉన్న క్వింఘై ప్రావిన్స్‌పైనా పడింది. ప్రధాన భూకంపం సంభవించిన గాన్సు ప్రావిన్స్‌లో 100 మంది, క్వింఘై ప్రావిన్స్‌లో 11 మంది మరణించినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ గ్ఝిన్హువా తెలిపింది. అలాగే గాన్సులో 96, క్వింఘైాలో 124 మంది గాయపడినట్లు వివరించింది. గాన్సు ప్రావిన్స్‌లోని జిషిషాన్ బోనన్‌ కంట్రీని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ప్రావిన్స్ రాజధాని లాంగ్ఘౌకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. జిషిషాన్‌కు 37 కిలోమీటర్ల దూరంలో గల లింగ్ఝియా ఛెంగ్వాన్ఝెన్ వద్ద ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)