అదానీ గ్రూపుకు వ్యతిరేకం మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ?

Telugu Lo Computer
0


గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి. ఈ వ్యవహారంలో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జార్జ్ సోరోస్ ఫండెడ్ గ్రూప్ ఇచ్చిన నివేదికతో ముడిపడి ఉన్న కేసులో పిటిషనర్లను ఘాటుగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ''మేము విదేశీ నివేదికను ఎందుకు నిజం చేయాలి..? మేము నివేదికను తిరస్కరించడం లేదు, కానీ మాకు రుజువులు కావాలి. మీ దగ్గర అదానీ గ్రూపుకు వ్యతిరేకం ఏం ఆధారాలు ఉన్నాయి..?'' అని భారత ప్రధానన్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిటిషనర్ తరుపు న్యాయవాది ప్రశాంత్ భూషన్‌ని ప్రశ్నించారు. బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్, ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పుతోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని తప్పుపట్టింది. మెరిట్ లెస్ హిండెన్‌బర్గ్ నివేదికను పునరుద్ధరించడానికి జార్జ్ సోరోస్ నిధులతో నడిచే విదేశీ మీడియా విభాగం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది. సెబీ కూడా ఈ నివేదిక నమ్మదగినదిగా లేదని తోసిపుచ్చింది. '' ఇలాంటి నివేదికపై స్పందిస్తే, మన ఏజెన్సీలే ఏమి చేయాలి..? విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలనున ప్రభావితం చేసే ట్రెండ్ నడుస్తోంది'' అని సెబీ తరుపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదిక రావడానికి ముందు మరియు తర్వాత ఏదైనా ఉల్లంఘన జరిగిందా అనే దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. అనుమానిత లావాదేవీలకు సంబంధించిన 24 కేసుల్లో 22 కేసులను సెబీ పూర్తి చేసిందని, మిగిలిన రెండింటి కోసం విదేశాల్లోని ఏజెన్సీల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని మెహతా చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)