ముంబై ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామని బెదిరింపు !

Telugu Lo Computer
0


హారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌) శుక్రవారం కేరళకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. తనకు బిట్‌కాయిన్‌లో పది లక్షల డాలర్లు చెల్లించకుంటే ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చివేస్తానని హెచ్చరించిన వ్యక్తిని ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ ఫీడ్‌బ్యాక్ ఇన్‌బాక్స్‌కు గురువారం బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న ఏటీఎస్ తెలిపింది. తాను చెప్పిన అడ్రస్‌కు పది లక్షల డాలర్ల విలువైన బిట్‌కాయిన్స్ పంపకుంటే విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ సదరు వ్యక్తి ఈమెయిల్‌లో బెదిరించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏటీఎస్ సైబర్ సెల్ దర్యాప్తు చేపట్టి ఐపీ అడ్రస్ ద్వారా వ్యక్తి కేరళలో ఉన్నట్టు గుర్తించారు. కేరళకు వెళ్లిన ఏటీఎస్ బృందం నిందితుడిని అరెస్ట్ చేసి ముంబైకి తరలించింది. ఆపై ఏటీఎస్ టీం నిందితుడిని సహర్ పోలీసులకు అప్పగించింది. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)