పాపులర్ ఇన్‌స్టాగ్రాం బాడీబిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో మృతి

Telugu Lo Computer
0


బ్రెజిల్‌కు చెందిన యువ వైద్యుడు, పాపులర్ ఇన్‌స్టాగ్రాం బాడీబిల్డర్ కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడు. 33 ఏండ్ల సాంటోస్ సా పౌలోలో గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడని ఆయన పనిచేస్తున్న క్లినిక్ వెల్లడించింది. స్టెరాయిడ్స్ వాడకం వల్లే సాంటోస్ మరణించాడనే వార్తలను క్లినిక్ తోసిపుచ్చింది. సా పౌలో లివర్ ట్యూమర్‌తో బాధపడుతూ గుండె పోటుకు గురయ్యాడని ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 19న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడని తెలిపింది. యువ డాక్టర్‌, బాడీబిల్డర్ తరచూ తాను వర్కవుట్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పో్ట్ చేస్తుండే వాడు. మొయేమాలో తాను భాగస్వామిగా ఉన్న క్లినిక్‌లోనే న్యూట్రిషనిస్ట్‌గా పనిచేస్తున్న సాంచెస్‌తో అతడి పరిచయం త్వరలో పెళ్లిపీటలకు ఎక్కనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)