ఇంఫాల్ విమానాశ్రయం మూసివేత !

Telugu Lo Computer
0


ణిపూర్ రాష్ట్రం రాజధాని ఇంఫాల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును మూసేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలో గుర్తు తెలియని డ్రోన్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం గగనతలంలో గుర్తుతెలియన డ్రోన్ కనిపించింది. వెంటనే విమాన కార్యకలాపాలను మూసివేయాని అధికారులు ఆదేశించారు.ఇంఫాల్ లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఫ్లైయింగ్ ఆబ్జెక్టును గుర్తించారు. దీంతో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే 2 విమానాలను కోల్‌కతాకి డైవర్ట్ చేయగా మరో మూడు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ డైరెకర్టర్ చిపెమ్మి కీషింగ్ డ్రోన్ చూసినట్లు ఒక ప్రకటనలో ధృవీకరించారు. కాంపిటెంట్ అథారిటీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మూడు విమానాలు బయలుదేరాయని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)