పాలస్తీనాకు ఔషధాలు, విపత్తు సహాయ సామాగ్రిని పంపిన భారత్ !

Telugu Lo Computer
0


జ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయి, సాయం కోసం ఎదురుచూస్తున్న పాలస్తీనా లోని గాజా ప్రజలను ఆదుకునేందుకు ఔషధాలు, విపత్తు సహాయ సామాగ్రిని ఆదివారం గాజాకు పంపినట్టు భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్ వైమానిక దళానికి చెందిన రెండవ సీ17 విమానం 32 టన్నుల సామాగ్రిని తీసుకువెళ్తోందని, ఈ సామగ్రి ముందుగా ఈఎల్‌అరిష్ విమానాశ్రయానికి చేరుకుంటుందని, అక్కడి నుంచి రఫా సరిహద్దు గుండా గాజాకు తీసుకెళ్తారని తెలిపారు. యుద్ధం కారణంగా అక్కడి రహదారులన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో పాలస్తీనా ప్రజలకు మానవతాసాయం చేరవేయడానికి ఉన్న ఏకైక మార్గం రఫా సరిహద్దు మాత్రమే. ఔషధాలు, ఇతర సామగ్రితో ఇప్పటికే విమానం బయలుదేరిందని జైశంకర్ తెలిపారు. అక్టోబరు లోనూ గాజాకు భారత్ మానవతాసాయం పంపించింది. ప్రాణాధార ఔషధాలు, గుడారాలు, శస్త్రచికిత్స వస్తువులు, శానిటరీ యుటిలిటీస్ టార్పాలిన్లు, స్లీపింగ్ బ్యాగ్స్, నీటి శుద్ధీకరణ మాత్రలు ఇతర వస్తువులతో కూడిన 6.5 టన్నుల సామగ్రిని గాజాకు చేర్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)