వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు విడుదల ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 10 November 2023

వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు విడుదల !


శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్‌ఈడీ)ను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్​లైన్​లో ఉంచింది. భక్తులు ttddevasthanam.ap.gov.in వెబ్​సైట్​లో టికెట్లు బుక్​ చేసుకోవాలని సూచించింది. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున.. 10 రోజుల పాటు 20 వేల టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను అందుబాటులో ఉంచనుంది. శ్రీవారి ఆలయంలో ఈ నెల 12న దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రొటోకాల్‌ దర్శనం మినహా మిగిలిన బ్రేక్‌ దర్శనాలు రద్దు చేశామని.. 11న బ్రేక్‌ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది.

No comments:

Post a Comment