దాల్ సరస్సులో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


మ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని శ్రీనర్‌లో ఉన్న దాల్‌ సరస్సులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు ఈ రోజు ఉదయం నిప్పంటుకుని మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో అనేక బోట్లు కాలి బూడిదయ్యాయి. దాల్‌ సరస్సులో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాల్‌ సరస్సులోని ఘాట్‌ నెంబర్‌ 9 సమీపంలోని హోస్‌బోట్‌లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ మంటలు ఇతర బోట్లకు వ్యాపించినట్లు పేర్కొన్నారు. సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అయిదు నుంచి ఎనిమిది పడవల వరకు పూర్తిగా దగ్ధం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)