చంద్రమోహన్‌ కన్నుమూత ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 11 November 2023

చంద్రమోహన్‌ కన్నుమూత !


ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్‌ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రశేఖర్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర్. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. చంద్రమోహన్‌ 1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్ రహీమ్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.  ఆయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌.

No comments:

Post a Comment