ఢిల్లీలో కురిసిన వర్షం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 10 November 2023

ఢిల్లీలో కురిసిన వర్షం !


ట్టమైన పొగమంచుల, తీవ్రస్థాయి వాయుకాలుష్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీవాసులకు వాన కొంచెం ఊరట కల్గింది. దీనితో నగరంలో దిగజారుతున్న వాయు ప్రమాణాలకు కళ్లెం పడింది. గత పదిరోజులుగా తల్లడిల్లుతున్న తమకు ఈ వాన కొంచెం ఊపిరినిచ్చిందని జనం తెలిపారు. ఈ నెల 20 తరువాత నగరంలో వాయుకాలుష్యానికి విరుగుడుగా కృత్రిమ వర్షాలకు ఇటీవలే ఢిల్లీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఐఐటి కాన్పూర్ నిపుణుల బృందంతో దీని గురించి చర్చించింది. దట్టమైన మబ్బులు నెలకొని ఉంటే ఎప్పుడైనా మేఘమథనానికి వీలుంటుందని , వర్షాలు కురిపించవచ్చునని భావిస్తున్నారు. ఈ లోగానే గురువారం అర్థరాత్రి నుంచి స్వల్పస్థాయిలో వర్షాలు పడుతూ ఉండటంతో జనం కొంచెం రిలీఫ్ పొందారు. ఇప్పుడు కురిసిన వర్షంతో వాయు కాలుష్య తీవ్రత గణాంకాలు స్వల్ప స్థాయిలో తగ్గినట్లు పొల్యూషన్ బోర్డు తమ శాస్త్రీయ విశ్లేషణల గణాంకాలతో తెలిపింది. ఢిల్లీ అంతటా కొద్దిపాటి వర్షాలు కురిసినట్లు వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి) తెలిపింది. కాగా పంజాబ్, హర్యానా, పశ్చిమ యుపి ఇతర ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయని ఐఎండి సీనియర్ సైంటిస్టు కుల్దీప్ శ్రీవాస్తవా తెలిపారు. దీని వల్ల తేమశాతం పెరిగి, క్రమేపీ స్వల్పస్థాయిలో అయిన వాయుకాలుష్య తీవ్రతకు చెక్‌పడుతుందని వివరించారు. 

No comments:

Post a Comment