క్లాస్‌మేట్‌ని ప్రేమించిందని పురుగు మందు తాగించిన తండ్రి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

క్లాస్‌మేట్‌ని ప్రేమించిందని పురుగు మందు తాగించిన తండ్రి !


కేరళలోని తిరువనంతపురం:లో క్లాస్‌మేట్‌తో ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కూతురుపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐరాన్ రాడ్‌తో ఆమెను కొట్టడంతోపాటు బలవంతంగా పురుగు మందు తాగించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఒకే స్కూల్‌లో చదువుతున్న 14 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల యువకుడి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఆమె తండ్రికి తెలిసింది. దీంతో అతడికి దూరంగా ఉండాలని, ఫోన్‌లో మాట్లాడవద్దని కుమార్తెను హెచ్చరించాడు. కాగా, అక్టోబర్‌ 29న ఆదివారం ఆ బాలిక తన ప్రియుడితో మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడింది. గమనించిన తండ్రి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొబైల్‌ ఫోన్‌ లాక్కోవడంతోపాటు ఐరన్‌ రాడ్‌తో కూతుర్ని కొట్టాడు. అంతటితో ఆగక క్రిమి సంహారక మందును బలవంతంగా తాగించాడు. ఆ బాలిక అస్వస్థత చెందగా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బాలిక తండ్రి ఆమెతో బలవంతంగా పురుగు మందు తాగించిన విషయాన్ని ఆసుపత్రి వర్గాలు పోలీసులకు తెలిపాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బాలిక తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment