ఫలితాలు వెల్లడయ్యే నాటికి జైల్లో ఉంటానో ? బయట ఉంటానో ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 2 November 2023

ఫలితాలు వెల్లడయ్యే నాటికి జైల్లో ఉంటానో ? బయట ఉంటానో ?


ధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో ఈరోజు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటికి తాను జైల్లో ఉంటానో..బయట ఉంటానో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అయితే తనకు జైలంటే భయం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సింగ్రౌలిలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ను ఆదరించిన తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ తమ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటికి తాను జైల్లో ఉంటానో..మరెక్కడ ఉంటానో తెలియదని, అయితే సింగ్రౌలికి కేజ్రీవాల్ వచ్చారు..తాము ఆయనకు చారిత్రక విజయం అందించామని ప్రతి ఒక్కరూ చాటిచెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు.


No comments:

Post a Comment