ఆదిత్య థాక్రేపై కేసు నమోదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 18 November 2023

ఆదిత్య థాక్రేపై కేసు నమోదు !


ముంబైలో లోయర్‌ పరేల్‌లో డిలిస్లే బ్రిడ్జీ రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప్రారంభించారు. దీంతో అనుమతి లేకుండా థాక్రే బ్రిడ్జీని నిర్మించారని ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు శనివారం ఆదిత్య థాక్రేతో పాటు సునీల్‌ షిండే, సచిన్‌ అహిర్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దక్షిణ ముంబై లోయర్‌ పరేల్‌ను కలుపుతూ డెలిస్లే బ్రిడ్జ్‌ను బీఎంసీ నిర్మించింది. ఇందులో కొంత భాగాన్ని గత జూన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో విడుతలో కర్రీ రోడ్‌, లోయర్‌ పరేల్‌ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జిని సెప్టెంబర్‌లో ప్రారంభించారు. అయితే లోయర్ పరేల్‌ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్‌ వంతెన ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఆ వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కానీ ఇవేవి పట్టించుకోకుండా శివసేన నేతలు ఈ వంతెనను గురువారం రాత్రి పారంభించారు. ఆ కారణంగా బీఎంసీ ఆదిత్య థాక్రే, సునీల్‌ షిండే, సచిన్‌ అహీర్‌లపై పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై 143, 149, 336, 447 సెక్షన్ల కింద చట్ట విరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

No comments:

Post a Comment