బస్సును రివర్స్‌ గేర్‌లో నడిపిన డ్రైవర్‌ !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని పూణేలో మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్‌ బస్సును రివర్స్‌ గేర్‌లో వెనక్కి నడిపాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  ఆదివారం పూణేలోని విఠల్‌ బాబా చౌక్ ప్రాంతంలో పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంటీ)కు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని రివర్స్ గేర్‌లో డ్రేవ్‌ చేశాడు. దీంతో ఆ బస్సు వేగంగా వెనక్కి వెళ్లడంతో వెనుక ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కాగా, ఆ సమయంలో రోడ్డుపై ఉన్న జనం కూడా ఇది చూసి షాకయ్యారు. బస్సును ఆపాలంటూ కేకలు వేశారు. ఒక వ్యక్తి బస్సు అద్దాలు పగులగొట్టి డ్రైవర్‌ వద్దకు వెళ్లి బస్సును ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం సేవించిన బస్సు డ్రైవర్‌ను నీలేష్ సావంత్‌గా గుర్తించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)