అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ !

Telugu Lo Computer
0


దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది. దేశంలో మొత్తం 4 లక్షల మంది బిచ్చగాళ్ల ఉన్నారు. ఇందులో 2 లక్షల మందికి పైగా పురుషులు అదే స్థాయిలో మహిళులు ఉన్నారు. బిచ్చగాళ్లలో పిల్లలు కూడా ఉండడం దారుణమైన విషయంగా చెప్పుకొవచ్చు. అయితే లెక్కలన్నీ ఏళ్ల క్రితం నాటివి.. ఇప్పుడు బిచ్చగాళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ 81 వేల మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా బిచ్చగాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ బిచ్చగాళ్లు ఎక్కువగా ఉన్నారట. ఆంధ్రప్రదేశ్ లో 30,218, బీహార్ 29,723 మంది, మధ్యప్రదేశ్ 28,695, రాజస్థాన్ 25,853 మంది బిక్షగాళ్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉండగా.. దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. అయితే ఈ లెక్కలన్నీ 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ప్రకటించారు. చాలా మంది ఉపాధి లేక బిచ్చగాళ్లుగా మారుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వృద్ధాప్యంలో పిల్లలు ఆదరణ లేకుండా చాలా మంది రోడ్లపైకి వచ్చు అడుకుంటున్నారు. ఇక దేశంలో బెగ్గింగ్ మాఫియా కూడా ఉంది. చాలా మంది అనాథ పిల్లలను బెగ్గింగ్ మాఫియా యాచక వృత్తిలోకి దించుతుందని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)