ప్రతిభతో మారుతి 800 కారును రోల్స్‌ రాయిస్‌గా మార్చాడు !

Telugu Lo Computer
0


కేరళకు చెందిన హదీఫ్‌ కు ఖరీదైన కార్లంటే పిచ్చి. వాటిని కొనుగోలు చేసే స్తోమత లేని హదీఫ్ నిరాశపడకుండా తన ఆలోచనలకు పదునుపెట్టాడు. తన వద్ద ఉన్న మారుతి 800 కారును లగ్జరీ కారుగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. నెలల తరబడి కష్టపడి పాత రోల్స్‌ రాయిస్‌ కార్ల విడిభాగాలను సేకరించాడు. ఆ విడిభాగాలను వెల్డింగ్‌ చేసి మారుతి 800 కారుకు అమర్చి.. రోల్స్‌ రాయిస్‌గా మార్చేశాడు. దీని కోసం అతడు రూ.45 వేలు మాత్రమే ఖర్చు చేయడం విశేషం. మారుతి 800 రోల్స్ రాయిస్ లో దర్జాగా చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హదీఫ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)