న్యుమోనియా - లక్షణాలు - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0

న్యుమోనియా బారినపడే వారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. కాబట్టి రోగులు మాస్కు ధరించాలి. న్యుమోనియా లక్షణాలు ఉంటే జనసందోహమున్న ప్రదేశాలకు వెళ్లకుండా, చల్లటి గాలిలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పొగతాగే అలవాటు ఉంటే ఊపిరితిత్తుల సమస్య జఠిలంగా మారే అవకాశముందని  వెంటనే ఈ అలవాటును మానేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి ముదిరితే న్యుమోనియా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్వరం 4 రోజులైన తగ్గక పోతే వైద్యుని సంప్రదిస్తే మంచిదని లేకపోతే న్యుమోనియా మరింత ముదిరే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాగా బెర్రీస్, ఆకు కూరలు, వాల్ నట్స్, బ్రొకోలీ, బెల్ పెప్పర్, ఆపిల్ తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)