దెయ్యం వదిలిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

దెయ్యం వదిలిస్తానని చెప్పి యువతిపై అత్యాచారం !


త్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ నుంచి ఒక కుటుంబం సీతామర్హిని సందర్శించేందుకు వచ్చిందని, వారికి అక్కడ మోతీలాల్ (52) అనే వ్యక్తి తనను తాను క్షుద్ర మాంత్రికుడిగా పరిచయం చేసుకున్నాడని, బాధిత మహిళ తల్లిదండ్రులు తమ కూతురుకు దెయ్యం పట్టిందని, నయం చేయాలని కోరారని పోలీసులు వెల్లడించారు. భూతవైద్యం ద్వారా యువతి శరీరం నుంచి దెయ్యాన్ని తరిమికొట్టగలనని సదరు కుటుంబాన్ని మోతీలాల్ నమ్మించాడు. దీని కోసం రూ. 4000 వసూలు చేసినట్లు ఎస్పీ చెప్పారు. గురువారం సాయంత్రం మహిళ తండ్రి ఆమెను మోతీలాల్ వద్దకు తీసుకెళ్లిన తర్వాత నిందితుడు యువతిని బైక్ పై దర్వాసీ గ్రామంలోని ఆలయం వెనక ఉన్న గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. మూడు గంటల తర్వాత మోతీలాల్ మహిళను బయటకు తీసుకెళ్లి, మరుసటి రోజు తనను కలవాలని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులతో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువతి తండ్రి నిందితుడు మోతీలాల్ పై ఫిర్యాదు చేశారు. అతనిపై అత్యాచారం, మోసం, బెదిరింపు కేసులు నమోదు చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం పంపగా, అత్యాచారం జరిగినట్లు నిర్థారణ అయింది. 

No comments:

Post a Comment