ఐటీ దాడుల్లో రూ.50కోట్లకు పైగా నగదు సీజ్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

ఐటీ దాడుల్లో రూ.50కోట్లకు పైగా నగదు సీజ్‌ !


ర్ణాటకలో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు దాడులు జరిపారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌, అతడి కుమారుడు, జిమ్‌ యజమాని, ఆర్కిటెక్ట్‌ సహా పలువురి ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.50కోట్లకు పైగా నగదు సీజ్‌ చేసినట్టు ఐటీశాఖ అధికారులు వెల్లడించారు. రెండు ప్రధాన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలకు సంబంధించి 25 చోట్ల గురువారం ప్రారంభమైన ఈ సోదాలు.. శనివారం సాయంత్రానికి 45 ప్రదేశాలకు చేరినట్టు ఒక అధికారి 'పీటీఐ'కి వెల్లడించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు సహకారనగర్, సంజయ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సంస్థల్లో సోదాల ఆధారంగా లభ్యమైన సమాచారంతో పలువురు కాంట్రాక్టర్లు, ఇతర వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. నిన్నటివరకు మొత్తంగా 45చోట్ల సోదాలు నిర్వహించగా.. శనివారం ఒక్కరోజే ఒక ఆర్కిటెక్ట్‌, జిమ్‌ యజమాని ఇళ్లల్లో జరిపిన సోదాల్లో రూ.8కోట్లు నగదు పట్టుబడిందన్నారు. దీంతో మొత్తంగా సీజ్ చేసిన నగదు రూ.50కోట్లకు చేరిందని తెలిపారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. గత భాజపా సర్కార్‌పై 40శాతం కమీషన్‌ ఆరోపణలు చేసిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్టు భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై భాజపా విరుచుకుపడుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, భాజపా సీనియర్‌ నేత సీటీ రవి మాట్లాడుతూ.. లంచాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నందున ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి నీటి కనెక్షన్ నిరాకరించిన సందర్భం కూడా ఉందన్నారు. చదరపు అడుగుకు రూ.100 చొప్పున లంచం ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదన్నారు.

No comments:

Post a Comment