రిటైర్డ్‌ నేవీ అధికారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా !

Telugu Lo Computer
0


ముంబైకు చెందిన కల్నల్‌ స్థాయి రిటైర్డ్‌ నేవీ అధికారికి సెప్టెంబర్‌ 8న ఓ ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్ కాల్‌లో తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు బ్యాంకు లాకర్‌ ఫీజు చెల్లించాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. ఫీజు కింద రూ.6,600 చెల్లించాలని కోరినట్లు తెలిసింది. అయితే ఆ ఫోన్‌ కాల్‌ వచ్చిన కొన్నిరోజుల తర్వాత రిటైర్డ్ నేవీ అధికారి తన బ్యాంక్‌ స్టేట్‌మెంట్ తనిఖీ చేశారు. అయితే ఆ స్టేట్‌మెంట్‌ చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైనట్లు తెలిసింది. సెప్టెంబర్ 8 నుంచి 15 మధ్య కాలంలో తన బ్యాంకు ఖాతా నుంచి 13సార్లు నగదు విత్‌డ్రా చేయబడినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. రిటైర్డ్‌ నేవి అధికారి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు ఎలా బదిలీ అయిందనే దానిపై స్పష్టత రాలేదు. సైబర్‌ నేరస్తులు ఫోన్ చేసిన సమయంలో సదరు మాజీ అధికారి వారు అడిగిన సున్నితమైన సమాచారం వారికి చేరవేసి ఉండవచ్చు. ఈ సమాచారంతో నేరగాళ్లు సదరు మాజీ నేవీ అధికారి ఖాతా నుంచి నగదు కొల్లగొట్టి ఉండవచ్చు. సెప్టెంబర్‌ 8న రూ.25,000 చొప్పున రెండు లావాదేవీలు, సెప్టెంబర్ 11న రూ.25వేల చొప్పున మూడుసార్లు, రూ.22వేల చొప్పున ఒకసారి నగదును అక్రమంగా విత్‌డ్రా చేశారు. అనంతరం సెప్టెంబర్‌ 13న రూ.75000, 15వ తేదీన మరో రూ.25000 నగదును తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఇలా మొత్తం రూ.2.37 లక్షల చోరీ చేశారు. అయితే ఈ నగదు విత్‌డ్రా సమయంలో నేవి మాజీ అధికారి ఫోన్‌ నంబర్‌కు ఎటువంటి మెసెజ్ రాలేదని తెలుస్తోంది. అపరిచితుల నుంచే వచ్చే కాల్స్‌పై ఎప్పుడు స్పందించవచ్చు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు పిన్‌ సహా ఇతర ఎటువంటి సున్నితమైన, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. 

Post a Comment

0Comments

Post a Comment (0)