దేశంలో ఈశాన్య రుతు పవనాలు !

Telugu Lo Computer
0

దేశంలో ఈశాన్య రుతు పవనాలు మొదలయ్యాయి. శనివారం ఈశాన్య రుతు పవనాలు షురూ అయ్యాయని, ఆ రుతు పవనాల ప్రభావంతో తమిళనాడు, కేరళలో వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ కేంద్రం  తెలిపింది. ఈ మేరకు ఐఎండీ ఒక ప్రకటన విడుదల చేసింది. రుతు పవనాల తిరోగమనం వల్ల ఆగ్నేయ, మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నదని ఐఎండీ పేర్కొంది. అదేవిధంగా కొమోరిన్ ఏరియాపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. శక్తిమంతమైన ఈశాన్య గాలులు దక్షిణ, మధ్య బంగాళాఖాతంపై బలంగా వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)