భద్రత కోసం గాజా దక్షిణం వైపుకు వెళ్లండి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

భద్రత కోసం గాజా దక్షిణం వైపుకు వెళ్లండి !


గాజా పై ఇజ్రాయిల్ కురిపిస్తున్న బాంబుల వర్షానికి గాజా అతలాకుతలం అయింది. దయనీయ స్థితిలో గాజా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ ధాటికి హమాస్ దిగివచ్చింది. గాజా పై  చేస్తున్న బాంబుల దాడిని నిలిపివేస్తే హమాస్ అధీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలందరిని విడుదల చేస్తాం అని తెలిపింది. కాగా గాజా భూభాగంలో సంభవించిన విపత్తు నేపథ్యంలో మానవతా పరిస్థితి గురించి యూఎన్ ఏజెన్సీలు ఇజ్రాయిల్ ని హెచ్చరించాయి. అయితే ఇజ్రాయిల్ మాత్రం హమాస్ పైన భూ దండయాత్రకు ప్రణాళికలను రోపొందిస్తున్నామని.. ఈ నేపధ్యంలో గాజా పైన దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ మేము గాజా పైన బాంబు దాడులను తీవ్రతరం చేయబోతున్నామని.. కనుక గాజాలో నివాసం ఉంటున్న ప్రజలు వారి భద్రత కోసం దక్షిణం వైపుకు వెళ్లాలని గాజా నగరవాసులకు పిలుపునిచ్చారు. గాజా యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత కోసం వాళ్ళని దక్షిణం వైపుకు తరలించాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అయితే యూఎన్ ఎన్‌క్లేవ్ జనాభాలో సగానికి పైగా ఇప్పటికే వేరు వేరు ప్రాంతాలకి శరణార్థులుగా వెళ్లారు. 

No comments:

Post a Comment