రైల్వే ట్రాక్‌పై జేసీబీ పరుగులు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday 21 October 2023

రైల్వే ట్రాక్‌పై జేసీబీ పరుగులు !


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రైల్వే ట్రాక్‌పై ఒక భారీ జేసీబీ పరుగులు తీసింది. అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  ఈ సంఘటన జరిగింది. లునీ రైల్వే జంక్షన్‌ వద్ద ట్రాక్‌ లెవల్‌ పెంచేందుకు, రైల్వే లైన్‌ మార్చేందుకు జేసీబీని వినియోగించారు. ఈ సందర్భంగా రైలు పట్టాలపై వెళ్లేందుకు రైల్వే అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్‌ వద్ద ఉన్న రైలు పట్టాలపై జేసీబీ పరుగులుతీసింది. డ్రైవర్‌ బ్యాలెన్స్‌ కోల్పోకుండా రైల్వే ట్రాక్‌పై జేసీబీని నడపడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి అవాక్కయ్యారు. డ్రైవర్‌ చాలా ఈజీగా జేసీబీని రైలు పట్టాలపై నడపడాన్ని కొందరు ప్రశంసించారు. మరికొందరు ఈ వీడియో క్లిప్‌ను రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు ఇతరుల దృష్టికి తీసుకెళ్లారు.

No comments:

Post a Comment