ఓటీటీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి !

Telugu Lo Computer
0


టీటీ వేదికలపై ప్రదర్శితమయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో మద్యం, ధూమపానానికి సంబంధించిన దృశ్యాలు వచ్చిన సమయంలో తెరపై కనిపించే హెచ్చరిక పూర్వక సందేశాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఓటీటీ నిబంధనలు-2023 కచ్చితంగా అమలు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపింది. కొన్ని ఓటీటీ వేదికలు మద్యం, ధూమపాన వ్యతిరేక హెచ్చరికలను సరిగా కనిపించేలా వేయడంలేదని, ప్రభుత్వ రాజీ ధోరణి వల్లే ఇలా జరుగుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఇందుకు కట్టుబడి ఉందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మీడియాలో వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. సిగరెట్లు, ఇతరత్రా పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను వీక్షకులకు హెచ్చరిక పూర్వకంగా తెలియజేయడానికే ఓటీటీ నిబంధనలు-2023ని ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఆ నిబంధనలను అన్ని ఓటీటీ వేదికలు అనుసరించాల్సిందేని విస్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)