అంజిరెడ్డి హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నపోలీసులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కొడుకు, బిడ్డ విదేశాల్లో స్థిరపడ్డారు. మరో కుమారుడు మోకిలాలో ఉంటున్నాడు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె, కొడుకు వద్ద వెళ్లారు. అక్కడే కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. దీంతో అంజిరెడ్డి దంపతులకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. అమెరికా సిటీజన్ షిప్ రావడంతో అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.  ఆయన నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్ కాట్రగడ్డ రవితో పరిచయం ఉంది. దీంతో అంజి రెడ్డి తన ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నట్లు 10 నెలల క్రితం ఇండియాకు వచ్చినప్పుడు రవికి చెప్పాడు. రవి ఇదే విషయాన్ని రియాల్టర్ల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నెల క్రితం అంజిరెడ్డి దంపతులు ఇండియాకు వచ్చారు. రవి జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డి పరిచయం చేశాడు. దీంతో అంజిరెడ్డి, రాజేష్ మధ్య పరిచయం పెరిగింది. పద్మారావు నగర్ లోని ఇంటిని కొనుగోలు చేస్తానని అంజిరెడ్డికి చెప్పారు. అది పాత ఇల్లు అయినా దాన్ని కూలగొట్టకుండా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేవాడు. ఇదంతా అంజి రెడ్డి దంపతులు నమ్మారు. సైదాబాద్ లో ఉన్న మరో స్థలాన్ని విక్రయించాలని అంజిరెడ్డి చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజేష్ తన వద్ద స్థలం కొనుగోలు చేసే పార్టీ ఉందని చెప్పారు. ఇంతలో అంజి రెడ్డి దంపతులు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అయితే భూములు అమ్మడానికి సమయం పడుతుండడంతో భార్యను తిరిగి  పంపాడు. అంజిరెడ్డిని మోసం చేయడానికి ఇదే సరైన సమయం అని రాజేష్ భావించాడు. అంజిరెడ్డికి రెండు దశల్లో రూ.2.1 కోట్లు నగదు చెల్లించినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డిని రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. బేస్‌మెంట్‌- 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు రాజేష్‌, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)