తమిళనాడు బీజేపీ కార్యకర్తల వేధింపులపై ప్రత్యేక కమిటీ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday 23 October 2023

తమిళనాడు బీజేపీ కార్యకర్తల వేధింపులపై ప్రత్యేక కమిటీ !


మిళనాడులో బీజేపీ కార్యకర్తలపై వేధింపులు జరుగుతున్నట్లు వార్తలు రావడం కలకలం రేపింది. దీనికి సంబంధించి కర్ణాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ నేతృత్వంలో బీజేపీ హైకమాండ్ నేతలు ప్రత్యేక కమిటీని వేశారు. తమిళనాడులో బీజేపీ కార్యకర్తలపై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సందానంద గౌడ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డీవీ సదానందగౌడతో సహా నలుగురితో కూడిన ప్రతినిధి బృందాన్ని తమిళనాడులో పర్యటించి బీజేపీ కార్యకర్తలను ఎవరు టార్చర్ పెడుతున్నారు ? అంటూ విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాల్సిందిగా జేపీ నడ్డా ఆదేశించినట్లు సమాచారం. ఈ కమిటీలోని నలుగురి వివరాల పేర్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి, ముంబాయి మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ ఎంపీ డాక్టర్ సత్యపాల్ సింగ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ పీసీ. మోహన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ నలుగురు సభ్యులు మాజీ సీఎం డీవీ సదానందగౌడతో కలిసి తమిళనాడు వెళ్లి బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నది ఎవరు ? అని పూర్తి సమాచారం సేకరించి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారని ప్రముఖ కన్నడ టీవీ చానల్ తెలిపింది.  2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో బలంగా ఉన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఇఫ్పటికే బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ-జేడీఎస్ పొత్తుపై కర్ణాటక మాజీ సీఎం డీవీ సదానంద గౌడ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ డీవీ. సదానందగౌడను ఢిల్లీకి రావాలని ఆదేశించింది. అక్టోబర్ 25వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా డీవీ. సదానందగౌడను బీజేపీ హైకమాండ్ ఆహ్వానించారు. ఈలోగా డీవీ. సదానందగౌడతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తమిళనాడు వెళ్లాల్సిందిగా బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల తమిళనాడులో బీజేపీతో జయలలిత పార్టీకి చెందిన ఏఐఏడీఎంకే నాయకులు తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తల కారణంగా ఆ రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా సూచనల మేరకు తమిళనాడులో విచారణ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ ప్రత్యేక మిటీ ఏర్పాటు చేసిందని తెలిసింది.

No comments:

Post a Comment