బోల్తా పడిన యాపిల్‌ లారీ !

Telugu Lo Computer
0


మ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి మంచి మనసును చాటుకున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిని మొత్తం క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ట్రక్కులో రూ. 25 నుంచి 30 లక్షల యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ లూఠీ కాకుండా సురక్షితంగా ఓ పక్కన పెట్టేశారు. దీంతో ఆపిల్ వ్యాపారికి లక్షల ఆస్తి నష్టం తప్పింది. ఈ సహాయంపై వ్యాపారి వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇదిలా ఉంటే.. రాంబన్ జిల్లా కమీషనర్ మస్రత్ జియా స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారందరిని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు కూడా తన హ్యాండిల్‌లో ఈ సంఘటన యొక్క వీడియోను విడుదల చేసారు. దేశంలో జరిగే ఇలాంటి సంఘటనల్లో సహాయ పడాలని.. వస్తువులను లూఠీ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)