పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ !

Telugu Lo Computer
0

2050 నాటికి భారతదేశంలో వృద్ధాప్య జనాభా రెట్టింపై, మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటుందని 'యూఎన్ ఎఫ్ పీఏ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023' తెలిపింది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాలలో పురుషుల కంటే మహిళల ఆయుర్ధాయం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ప్రస్తుత వృద్ధాప్య జనాభా, వృద్ధుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఈ రిపోర్ట్ దృష్టి సారించింది. పలు వివరాలను వెల్లడించింది. UNFPA వెల్లడించిన డేటా ప్రకారం..భారత్ లో రాజస్థాన్,హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జమ్ము అండ్ కశ్మీర్ 60 ఏళ్లలోపు మహిళలు ఆయుర్ధాయం 20 ఏళ్లు కంటే ఎక్కువగా ఉంది. అంటే 60 ఏళ్లు ఉన్న మహిళ మరో 20 ఏళ్లు ఎక్కువ జావించగలరట. 60 ఏళ్లు ఉన్న మహిళలు 18.3 ఏళ్లు సగటున జీవించొచ్చు అని అంచనా వేసింది ఈ నివేదిక. ఇది మహిళలు దాదాపు 20 ఏళ్ల ఎక్కువ ఆయుర్ధాయం ఉంటే అదే పురుషుల్లో 17.5 ఏళ్లుగానే ఉందని నివేదిక వెల్లడించింది. అంటే మహిళల కంటే పురుషుల ఆయుర్ధాయం కాస్త తక్కువ అని వెల్లడించింది. అలాగే 2050 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవుతుందని..మొత్తం జనాభాలో 20 శాతానికి ఇది చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే 2022 (జులై 1నాటికి) నాటికి 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 14.9 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇది మొత్తం దేశ జనాభాలో 10.5 శాతానికి సమానం. దీంతో 2050 నాటికి ఈ సంఖ్య 20.8 శాతానికి చేరుకుంటుంది. అంటే 34.7 కోట్ల మందికి వృద్ధ జనాభా పెరుగుతుందని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)