మహారాష్ట్ర 43 రోజుల్లో 20 వేల మంది అవయవ దానానికి సంతకాలు

Telugu Lo Computer
0


దేశంలో అవయవదానం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అవయవదాతల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) అనే పోర్టల్ ను ప్రవేశ పెట్టింది. బాడీ పార్ట్స్ ను డొనేట్ చేయాలనుకొనే వారు ఈ పోర్టల్ లో సైన్ అప్ కావాలని ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా 80 వేల మంది ఈ పోర్టల్ లో సైన్ అప్ అయ్యారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కేవలం 43 రోజుల్లో 20 వేల మంది సైన్ అప్ అయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న వారిలో మహారాష్ట్ర ప్రజలు 22 వేల 335 (28 శాతం) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ (18,289), తెలంగాణ (11,053), కర్ణాటక (6,752), ఆంధ్రప్రదేశ్ (4,055) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) పోర్టల్‌లో డిజిటల్ ప్రతిజ్ఞ వ్యవస్థను ప్రారంభించిన 43 రోజుల్లోనే, మహారాష్ట్ర ప్రజలు 20 వేల మందికి పైగా తమ అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే నాందేడ్ (644), సింధుదుర్గ్ (1,070), వార్ధా (675) మరియు సాంగ్లీ (671) జిల్లాలు ముంబై .. నాగ్‌పూర్ (233) నగరాల్లో ప్రజలు ఈ పోర్టల్ లో సైన్ అప్ అయ్యారు. గతేడాది కంటే ఈ ఏడాది అవయవ దానం చేసే వారి సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. అవయవాల కోసం ఇంకా 4 వేల మంది ( వార్త రాసే రోజుకు) వెయిటింగ్ లో ఉన్నారని... వీరిలో 200 మందికి 2023 డిసెంబర్ నాటికి అవయవాలను మార్పిడి చేసే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అవయవాలను దానం చేసేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, క్లోమం , ప్రేగులు వంటి ముఖ్యమైన అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కార్నియా, చర్మం వంటి కణజాలాలను దానం చేయడం ద్వారా చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపగలరు. NOTTO వెబ్‌సైట్ ప్రకారం 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఎముకలు, గుండె కవాటాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ వయస్సు వారు 40 వేల మంది... 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు 22 వేలమంది, 45 నుంచి 60 ఏళ్ల వారు 18 వేలమంది, 60 ఏళ్లు దాటిన వారు 2 వేల 651 మంది NOTTO వెబ్‌సైట్ లో సైన్ అప్ అయ్యారు.అవయవదానం, మార్పిడికి సంబంధించి ఏదైనా సమాచారం కోసం నోటో వెబ్ సైట్ www.notto.mohfw.gov.in లో సైన్ అప్ కావాలి. లేదా టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 180114770 కు కాల్ చేయవచ్చు. అలాగే పైన పేర్కొన్న నోటో వెబ్ సైట్ తో పాటు https://pledge.mygov.in/organ-donation/ ఆన్ లైన్ ప్లెడ్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)