ఒక్క బాల్‌కు 13 పరుగులు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని  ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు కేవలం 223 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో కివీస్ ప్లేయర్ ఒక్క బంతిలో 13 పరుగులు రాబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఆ రెండు సిక్సులు కూడా ఒకే బాల్‌కు కొట్టాడు. దీంతో ఒక్క బాల్‌కే 13 పరుగులు రాబట్టాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను నెదర్లాండ్స్ బౌలర్ బాస్ డిలీడే వేశాడు. ఇన్నింగ్స్ లో చివరి బంతిని శాంట్నర్ లాంగ్ ఆన్ పై సిక్స్ కొట్టాడు. అయితే, ఆ బాల్ ను అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఫ్రీ హిట్ వేయాల్సి వచ్చింది. మరోసారి బాస్ డిలీడే తక్కువ ఎత్తులో ఫుల్ టాస్ వేశాడు. దానిని కూడా లాంగాన్ మీదుగా స్టాండ్స్ లోకి సిక్స్ కొట్టాడు. దీంతో ఒక్క బాల్ కే 13 పరుగులు వచ్చినట్లయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)