సీతాఫలం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. లేదంటే వారి ప్రాణానికే ప్రమాదం. అందులో సీతాఫలం కూడా ఒకటి. సీతా ఫలాలు తియ్యగా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని చూడగానే తినాలనిపిస్తుంది. సీతాఫలం తింటే ఎంతో ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇవి సీజనల్ గా దొరికే పండ్లు కాబట్టి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. అలాగే సీతా ఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా సీతా ఫలాన్ని తినవచ్చు. సీతా ఫలంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతా ఫలాన్ని ఎలాంటి వారైనా ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. గుండె జబ్బులు ఉన్న వారు, లావుగా ఉన్నవారు, పాలిసిస్టిక్ ఓవరీ సండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా నిస్సహందేహంగా తినవచ్చు. సీతాఫలం తింటే అరుగుదల సమస్యలు ఉండవు. జీవ క్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు. సీతాఫలంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో కంటి సమస్యలు దరిచేరవు. అలాగే కంటి శుక్లాల సమస్యలు కూడా ఉండవు. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగు పరచడంలో సీతా ఫలం హెల్ప్ చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య కూడా ఉండవు.

Post a Comment

0Comments

Post a Comment (0)