మధుమేహం - స్టీవియా ఆకులు !

Telugu Lo Computer
0


ధుమేహం సమస్యతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ చికిత్స తీసుకుంటున్నారు. ఎంత కంట్రోల్ లో ఉన్నా కూడా రోజు రోజుకూ ఈ వ్యాధి తీవ్రతరం అవుతూనే ఉంటుంది. దీంతో నచ్చిన ఆహారం తినలేక నోరు కట్టుకోవాల్సి వస్తుంది. స్టీవియా ఆకులు గురించి చాలా మందికి  తెలియదు. ఈ ఆకులు తియ్యగా ఉంటాయి. ఈ ఆకుల పొడి మనకు ఎక్కడైనా లభిస్తుంది. మధుమేహం ఉన్న వారు చక్కెరకు బదులుగా దీన్ని వాడుకోవచ్చు. అలాగే డయాబెటీస్ ను కొద్ది రోజుల్లోనే కంట్రోల్ లోకి తీసుకొస్తుంది. క్రమం తప్పకుండా ఈ ఆకుల పొడిని వాడితే షుగర్ ను పూర్తిగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పంచదార, బెల్లం వంటి వాటికి బదులు ఈ స్టీవియా ఆకుల పొడిని వాడుకోవచ్చు. టీ, కాఫీ, జ్యూస్ లు, టిఫిన్స్ లోకి, లస్సీ, వేడి వేడి పదార్థాల్లోకి ఇలా ఈ ఆకుల పొడిని తీసుకోవచ్చు. స్టీవియా ఆకుల్లో క్యాలరీలు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ వంటి పోషకాలు ఉండవు. కాబట్టి ఈ ఆకులను హ్యాపీగా జీర్ణం అవుతుంది. ఇంకా ఈ పొడితో మరి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పొడిని వాడటం వల్ల షుగర్ మాత్రమే కాకుండా, ఆస్థమా, శ్లేష్మాలు, దగ్గు, పిల్లికూతలు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది బ్లడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)