పట్టుదలకు, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 September 2023

పట్టుదలకు, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద !


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పిలుపు మేరకు చెస్‌ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద, ఆయన తల్లిదండ్రులు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చెస్ మేధావిని అభినందించిన ప్రధాని అతని తల్లిదండ్రులతో అప్యాయంగా మాట్లాడారు. వారితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఇంటికి విశిష్ఠ అతిథులు వచ్చారని పేర్కొన్నారు. 'ప్రజ్ఞానందను అతని కుటుంబంతో సహా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదల, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద. నిన్ను చూసి గర్విస్తున్నా' అని పేర్కొన్నారు. మరోవైపు ప్రజ్ఞానందపై ప్రశంసలతో పాటు , ప్రోత్సాహకాల వర్షం కూడా కురుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రోత్సాహక బహుమతి కింద రూ. 30 లక్షల నజరానా అందించారు. ఆనంద్ మహీంద్రా అతని తల్లిదండ్రులకు ఎక్స్‌ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ప్రకటించారు. ఈ ప్రత్యేక బహుమతిపై యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్పందిస్తూ ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతలు తెలియజేయడానికి తనకి మాటలు కూడా రావటం లేదాని, EV కారు కొనడం నా తల్లిదండ్రుల చిరకాల కల, ఆ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రా సార్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రజ్ఞానంద ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందనగా కార్ల తయారీదారు అంతిమ లక్ష్యం కస్టమర్ల కలలను నేరవేర్చడమే అన్నారు. 

No comments:

Post a Comment