ఎన్‌యు ఎంఎ సిలబస్ లో 'రామజన్మభూమి ఉద్యమం', బిజెపిపై పాఠాలు !

Telugu Lo Computer
0


నాగ్‌పూర్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) ఎంఎ చరిత్ర సిలబస్‌లో సిపిఐ (ఎం) చాప్టర్‌ను తొలగించి, 'రామజన్మభూమి ఉద్యమం', బిజెపి లను చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసంఘ్ లోని విభాగాలు అలాగే గతంలోని రిపబ్లికన్‌ పార్టీ అధ్యాయాన్ని యథావిథిగా ఉంచింది. అయితే కాంగ్రెస్‌ మిత్రపక్షం డిఎంకె స్థానంలో బిజెపి మిత్రపక్షం అన్నాడిఎంకెను చేర్చింది. ఖలిస్తాన్‌ ఉద్యమంలో ఓ అధ్యాయాన్ని కూడా తొలగించినట్లు టైమ్స్‌ ఆప్‌ ఇండియా నివేదించింది. ''ఇండియన్‌ మాస్‌ మూవ్‌మెంట్స్‌ ఫ్రమ్‌ 1980-2000'' లో రామజన్మభూమి ఉద్యమాన్ని చేర్చింది. గతంలోనూ సిలబస్‌ను మార్చి వివాదాలను ఎదుర్కొంది. 2019లో నాలుగో సెమిస్టర్‌ కోసం సూచించిన బిఎ చరిత్ర సిలబస్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)ను చేర్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సిలబస్‌ను ఎన్‌యు బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (హిస్టరీ) చైర్మన్‌ శ్యామ్‌ కొరెట్టి రూపొందించారు.'' సిపిఐ(ఎం) జాతీయ పార్టీ కానందున జాతీయ స్థాయిలో పట్టు ఉన్న బిజెపిని సిలబస్‌లో భాగం చేశాం. కేవలం 2010 వరకు మాత్రమే బిజెపి చరిత్రను చేర్చాం. మేము విద్యార్థులకు తప్పుడు విషయాలను బోధించడం లేదు'' అని కొరెట్టి పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి కట్టుబడి ఈ ఏడాది ఎన్‌యు సిలబస్‌ ఉండాలని అన్నారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చామని అన్నారు. సిలబస్‌ మార్పుపై అసెంబ్లీ ప్రతిపక్ష నేత విజరు వడెట్టివార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి తన సిద్ధాంతాలైన మతతత్వం, కులతత్వపు విద్వేషపు భావజాలాన్ని ప్రజలపై రుద్దుతోందని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించిన బిజెపి మహిళలను గౌరవించదు. ఇక బిజెపి విద్యార్థులకు ఏం బోధిస్తుందని ధ్వజమెత్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)