డ్రై ఫ్రూట్స్ - ఆరోగ్య ప్రయోజనాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 September 2023

డ్రై ఫ్రూట్స్ - ఆరోగ్య ప్రయోజనాలు !


డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్‌ తినమని వైద్యులు సూచిస్తుంటారు. శరీరానికి మేలు చేసే ఎన్నో మంచి గుణాలు డ్రై ఫ్రూట్స్‌లో ఉంటాయి. మనలో దాదాపు చాలా మంది డ్రైఫ్రూట్స్‌ను  నేరుగా తీసుకుంటారు. లేదా బాదం లాంటి కొన్నింటిని నీటిలో నానబెట్టి తీసుకుంటారు. అయితే డ్రై ఫ్రూట్స్‌ను తేనెలో నానబెట్టి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అధికం.  డ్రై ఫ్రూట్స్‌ను సాధారణంగా తీసుకునే దాని కంటే తేనెలో నానబెట్టి తీసుకుంటే చాలా మేలు అని నిపుణులు చెబుతున్నారు. తేనెలో ఉండే నేచురల్ షుగర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రైఫ్రూట్స్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌, తేనెలో ఉండే మంచి గుణాలు కలిసి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో శరీరం ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  తేనెలో కలిపిన ఎండు ద్రాక్షను తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. పొటాషియం, ఫైబర్‌, ఫినోలిక్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. డ్రై ఫ్రూట్స్‌ను తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా బాదం, ఖర్జూరం, అంజీర్‌, ఎండు ద్రాక్ష వంటి వాటిని తేనెలో కలుపుకొని తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్‌ స్తాయిలు పెరుగుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి కూడా తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్‌ ఉపయోగపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందనే విషయం తెలిసిందే. తేనె కలపి తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ మరింత ఆరోగ్యకరంగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలతో పోరాడడంలో తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో కూడా తేనె కీలక పాత్ర పోషిస్తుంది. తేనె, డ్రైఫ్రూట్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ని ఇవి బ్యాలెన్స్‌ చేస్తాయి.

No comments:

Post a Comment