మంత్రి బాలాజీ బెయిల్ పిటిషన్ కొట్టివేత

Telugu Lo Computer
0


నీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు చెన్నైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. మాజీ దివంగత సీఎం జయలలిత ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని బాలాజీపై ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఆయనను జూన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆయన అరెస్ట్ రాజకీయ వివాదానికి దారితీసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారన్నస్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత జూన్ 14న బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. గత నెలలో కోర్టు సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. అతని అరెస్టును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఆయన ప్రస్తుతం పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా ఉన్నారు. ఆయనకు సీఎం స్టాలిన్ మద్దతు ఇచ్చారు. స్టాలిన్ తన వైఖరిపై పునరాలోచించుకోవాలని రెండు వారాల క్రితం హైకోర్టు వ్యాఖ్యానించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)