అశోక్‌ లేలాండ్‌కు గుజరాత్‌ ఆర్టీసీ నుంచి భారీ ఆర్డర్‌ !

Telugu Lo Computer
0


గుజరాత్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి 1,282 బస్సుల ఆర్డర్‌ను పొందినట్లు ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ శుక్రవారం ప్రకటించింది. ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్ కోసం రాష్ట్ర రవాణా సంస్థ నుంచి పొందిన అతి పెద్ద ఆర్డర్‌లో ఇది ఒకటని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. భారతీయ బస్‌ మార్కెట్‌లో అశోక్‌ లేలాండ్‌ ఇప్పటికే మంచి స్థానంలో ఉంది. ఈ ఆర్డర్‌ ఒప్పందం ప్రకారం 55 సీట్ల పూర్తి అసెంబుల్డ్‌ BS-VI డీజిల్‌ బస్సులను దశల వారీగా డెలివరీ చేస్తుంది. ఇందులో బలమైన 147 KW (197 HP) H-సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది. గుజరాత్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (GSRTC) అశోక్‌ లేలాండ్‌తో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉంది. ఇప్పటికే అశోక్‌ లేలాండ్‌ 2,600 బస్సులను సరఫరా చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)