భూమి ప్రభావాన్ని దాటి లక్ష్యం దిశగా ఆదిత్య ఎల్ 1

Telugu Lo Computer
0

దిత్య ఎల్ 1 మిషన్ భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో ప్రకటించింది.ఆదిత్య ఎల్ 1 'స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్ ను దాటినట్లుగా ఇస్రో వెల్లడించింది. ప్రయోగించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆదిత్య ఎల్ 1 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భూమి ప్రభావం ఉండే ఈ ప్రాంతాన్ని దాటేసిందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ భూమి, సూర్యుడికి మధ్యలో ఉండే లాంగ్రేజ్ పాయింట్ దిశగా వెళ్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో చరిత్రలో రెండు స్పేస్ క్రాఫ్టులు మాత్రమే ఎర్త్ ఇన్ఫూయెన్స్ ని దాటి వెళ్లాయి. ఇందులో ఒకటి మంగళయాన్ కాగా,  రెండోది ఆదిత్య ఎల్ 1 మిషన్.సెప్టెంబర్ 2న శ్రీహరికోటన్ నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ఆదిత్య ఎల్1ను ఇస్రో ప్రయోగించింది. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడి తగిన వేగం పొందేందుకు ఆదిత్య ఎల్ 1 మిషన్ పలుమార్లు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరిగింది. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ఐదుసార్లు ఆదిత్య ఎల్ 1 కక్ష్యను పెంచారు. దీంతో అనుకున్న వేగం సాధించిన ఎల్ 1 పాయింట్ వద్దకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)