రుణాలపై వడ్డీని రీసెట్ చేసుకునే అవకాశం !

Telugu Lo Computer
0


వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఇండ్ల రుణాలపై నెలసరి వాయిదా (ఈఎంఐ)లను బ్యాంకులు పెంచేస్తాయి. దీంతో రుణ గ్రహితలు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రుణ గ్రహీతల బాధలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. రుణాలపై వడ్డీలను రీసెట్ చేసుకునే అవకాశం రుణగ్రహితలకు కల్పించింది. ఈ విషయమై గత నెల 18న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం వడ్డీరేట్లు పెరిగినప్పుడు ఈఎంఐలు పెంచుకోవాలా, లోన్ టెన్యూర్ పెంచుకోవాలా అన్నది రుణ గ్రహీతలే నిర్ణయించుకోవచ్చు. అలాగే ఫ్లోటింగ్ లేదా ఫిక్స్‌డ్ ఇంటరెస్ట్ రేట్ ఖరారు చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)