ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 September 2023

ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి !

త్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో  వారాహి గ్రామానికి చెందిన 17 ఏండ్ల నైన్సీ పటేల్, హీరాపూర్ బజార్‌లోని రాంరాజీ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నది. కాలేజీ ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగడంతో ఆమె సైకిల్‌ అదుపుతప్పి రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో  విద్యార్థిని తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శుక్రవారం కాలేజీ ముగిసిన తర్వాత ఆ విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తున్నది. కొందరు ఆకతాయిలు రెండు బైకులపై ఆ యువతిని వెంబడించారు. ఒక బైక్‌ వెనుక కూర్చొన యువకుడు నైన్సీ చున్నీ లాగాడు. దీంతో ఆమె సైకిల్‌ అదుపుతప్పింది. వెనుక వస్తున్న మరో బైక్‌తోపాటు ఎదురుగా వచ్చిన బైక్‌ ఆమె సైకిల్‌ను ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు నైన్సీ పటేల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు తమ కుమార్తె వెంటపడి వేధించడంతోపాటు ఆమె ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితులైన షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

No comments:

Post a Comment