మూన్‌ మిల్క్‌ - ఆరోగ్య ప్రయోజనాలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 September 2023

మూన్‌ మిల్క్‌ - ఆరోగ్య ప్రయోజనాలు !


యుర్వేద మూలికల నుంచి తయారుచేసిన దివ్వ ఔషధం మూన్‌మిల్క్‌. పూర్వం ఈ పానీయంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేవారట. అందువల్లే వాళ్లు ఎలాంటి అనారోగ్యం బారిన పడిన తట్టకుని బతికిబట్టగట్టగలిగేవారట. దీన్ని అత్యంత శక్తివంతమైన ఔషధంగా వారంతం ప్రగాఢంగా విశ్వసించేవారని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. ఇది దాదాపు 5వేల ఏళ్ల నాటి పురాతన సహజసిద్ధ ఔషదం. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడం కోసం మూన్‌మిల్క్‌ని ఉపయోగించేవారట. మీకు పుష్టిని కలిగించడమేగాక రోగనిరోధక శక్తిని పెంచేలా ఈ మూన్‌మిల్క్‌కి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా దీని తయారీలో ఉపయోగించే మూలిక ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయని అంటున్నారు. దీన్ని ఆవు పాలతో తయారు చేస్తారు. ముఖ్యంగా కొలస్ట్రాల్‌ లేకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉపయోగించే బాదం, సోయా, వోట్‌, దాల్చిన చెక్క, ఏలకులు, పసుపు అశ్వగంధం తదితర సుగంధ ద్రవ్వయాలు వినియోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి తోపాలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌లను వృద్ధి చేస్తుంది. ఇక ఇందులో వినయోగించే అశ్వగంధం వంటి అడాప్టోజెనిక్‌ మూలికలు శరీరంలో కార్టిసాల్‌​ స్థాయిలను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మూన్‌ మిల్క్‌ని సేవిస్తే కలవరపాటుకు గురి కాని మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో ఉపయోగించే పసుపు, అ‍ల్లం వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను వృద్ధి చేసి రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. శీతాకాలంలో దీన్ని సేవిస్తే మరింత ప్రయోజనం ఉండటమే గాక ఎన్నో రుగ్మతల నుంచి ఈజీగా బయటపడొచ్చు. యాలకులు, దాల్చిన చెక్క వంటి సున్నితమైన సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడం మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ మసాలాలు అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌ల వంటి సమస్యలకు చెక్‌పెడతాయి. 

No comments:

Post a Comment